`పులిజూదం` చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, హన్సిక, రాశీ ఖన్నా, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ 'పులిజూదం'. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రవితేజ 'పవర్', 'ఆటగదరా శివ', తమిళంలో రజనీకాంత్ 'లింగా', హిందీలో సల్మాన్ ఖాన్ 'భజరంగి భాయీజాన్' సినిమాలు నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాత 'రాక్ లైన్' వెంకటేష్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులోనూ ఆయనే విడుదల చేస్తున్నారు. ఈ నెల (మార్చి) 21న విడుదలైన ఈ చిత్రం కోటి రూపాయలకు పైగా షేర్‌ను సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.
ఈ సందర్భంగా... మోహన్ లాల్ మాట్లాడుతూ వైవిధ్యమైన చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందు ఉంటారని మరోసారి మా పులిజూదం
సినిమాతో నిరూపితమైంది. నేను నటించిన మన్యంపులి సినిమా కంటే పులి జూదం సినిమా చాలా పెద్ద హిట్ సాధించింది. పులిజూదం సినిమాను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులను నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నారు.

The post Mohan Lal Thanks Telugu Audience For Making Puli Joodham Movie A Hit appeared first on Social News XYZ.