

మహానటిఫేం బేబి తుషిత ప్రధాన పాత్రలో నటిస్తున్న
ఎర్రచీరచిత్రం రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చెరువుపల్లి సుమన్ బాబు,
శంభో శంకర` ఫేం కారుణ్య, కమల్ కామరాజు ముఖ్య తారాగణం. తోట సతీష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సి.హెచ్ సుమన్ మాట్లాడుతూ -ఫ్యామిలీ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలోని అందమైన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమా ఆద్యంతం సస్పెన్స్ కట్టి పడేస్తుంది. వచ్చే నెల 15 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ సాగిస్తున్నాం. ప్రస్తుతం రికార్డింగ్ పనులు పూర్తవుతున్నాయి. ప్రమోద్ సంగీత సారథ్యంలో రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. మహానటి ఫేం బేబి తుషిత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కథ, కథనం హైలైట్ గా తెరకెక్కుతున్న క్రేజీ చిత్రమిది
అన్నారు. సుమన్ బాబు, కమల్ కామరాజు, కారుణ్య, అలీ, రఘుబాబు, ఉత్తేజ్, మహేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: గోపి విమల పుత్ర, కెమెరా: చందు, సంగీతం : ప‌్రమోద్ పులిగిల్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తోట సతీష్, కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సి.హెచ్ సుమన్ బాబు.
The post Erra Chira movie completes sound recording appeared first on Social News XYZ.