బాలికల సంక్షేమ నిధి కోసం కె.ఎస్.చిత్ర సంగీత విభావరి




బాలికల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ప్రముఖ గాయని చిత్ర పాడబోతున్నారు. మార్చి 17న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ కార్యక్రమంలో చిత్రతోపాటు గాయనీగాయకులు శ్రీకృష్ణ, శ్రీనిధి, సాకేత్, సోని కూడా పాడబోతున్నారు. ఎలెవన్ పాయింట్ టు సంస్థ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వికేర్ సంస్థ సమర్పిస్తోంది.
ఈ సంగీత విభావరి గురించి కె.ఎస్.చిత్ర మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత సింగర్ కె.ఎస్.చిత్ర మాట్లాడుతూ ''వి కేర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ప్రోగ్రాంలో పాడబోయే పాటలను ఇప్పటికే కొన్నింటిని ప్రాక్టీస్ చేశాం. కొన్నింటిని శ్రీకృష్ణ, కొన్నింటిని శ్రీనిధి పాడుతున్నారు. సాకేత్, సోని కూడా కొన్ని పాటలు పాడతారు. మీ అందరికీ బాగా పరిచయమున్న మ్యూజిషియన్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇందులో అన్నీ తెలుగు పాటలే ఉంటాయి. మంచి కాజ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం ఇది. కాబట్టి అందరూ దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మూడు గంటల పాటు సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
శ్రీకృష్ణ మాట్లాడుతూ ''భారతీయ భాషలు చేసుకున్న పుణ్యమిది. మా చిత్రమ్మగారు మంచి కార్యక్రమం చేయబోతున్నారు. ఒక మంచి కాజ్ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. గర్ల్ ఛైల్డ్‌కి షెల్టర్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం'' అన్నారు.
శ్రీనిధి మాట్లాడుతూ ''ఈ కాన్సర్ట్‌లో నేను కూడా అసోసియేట్ అయి పాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గర్ల్ ఛైల్డ్ సపోర్ట్ కోసం చేస్తున్న ఈ ప్రోగ్రాం అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిత్రగారి పాటలు వినాలనుకునేవారంతా రేపు తప్పకుండా రావాలి'' అన్నారు.
సాకేత్ మాట్లాడుతూ ''చిత్రగారితో కలిసి ఒక లైన్ అయినా పాడాలన్న డ్రీమ్ నా చిన్నప్పటి నుంచి ఉంది. ఒక మంచి కాజ్ కోసం చేస్తున్న రేపటి కాన్సర్ట్ ద్వారా నా డ్రీమ్ నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది'' అన్నారు.
సోని మాట్లాడుతూ ''ఈ కాన్సర్ట్‌లో నేను కూడా ఒక భాగమవడం చాలా సంతోషంగా ఉంది. గర్ల్ ఛైల్డ్ కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ రావడం ద్వారా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
The post Singer KS Chithra Doing A Live Concert For Girls Welfare Fund appeared first on Social News XYZ.