హీరో కాదు.. ఆ రోల్ కనిపించింది!!
దర్శకేంద్రుడి ప్రశంసను మర్చిపోలేను! - హీరో రామ్ కార్తీక్


దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంతటి దిగ్గజం నా సినిమా వీక్షించి చక్కని ఎమోషన్స్ పండించావని కితాబిచ్చారు. ఆ అరుదైన ప్రశంస నాలో ఎంతో ఉత్సాహం నింపిందని అంటున్నారు యువహీరో రామ్ కార్తీక్. ఈ యంగ్ హీరో నటించిన రెండు సినిమాలు వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, మౌనమే ఇష్టం .. ఒకేసారి థియేటర్లలోకి రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాల్లో తన నటనకు ప్రత్యేకంగా ప్రశంసలు దక్కాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండూ ఒకేసారి రిలీజవ్వడం ఉల్లాసం నింపితే, అవి రెండూ చక్కని టాక్ తో విజయవంతంగా థియేటర్లలో రన్ అవ్వడం బోనస్ అని అంటున్నారు కార్తీక్. ఇంకా ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ యువకథానాయకుడు చెప్పిన సంగతులివి.
* ఒకేసారి రెండు రిలీజ్ లు.. స్పందన ఎలా ఉంది?
నేను నటించిన వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, మౌనమే ఇష్టం ఒకేసారి రిలీజయ్యాయి. ఇది అరుదైన సన్నివేశం. ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. థియేటర్లలో ఎమోషన్ సీన్స్ కి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
వెంకట లక్ష్మి రెస్పాన్స్?
ఎమోషన్స్ కి.. భయపెట్టే సన్నివేశాలకు జనం బాగా కనెక్టవుతున్నారు. నా పాత్రకు స్పందన బావుంది. రాయ్ లక్ష్మీని తప్ప ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేరు అన్నంతగా తను నటించారు.
మౌనమే ఇష్టం
రెస్పాన్స్?
ఆ సినిమా ఓ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో నా రోల్ యువతరం అందరికీ బాగా కనెక్టవుతోంది. బాగా నటించానని ప్రశంసలు దక్కాయి. నిజాయితీ ఉన్న ప్రేమకథ ఇది. సీనియర్ కళాదర్శకులు అశోక్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. సహజసిద్ధంగా చూపిస్తూనే కమర్షియల్ కోణంలో తెరకెక్కించారు. ఆయనకు నా సిన్సియర్ థాంక్స్.
కాంప్లిమెంట్స్?
మౌనమే ఇష్టం
సినిమా చూసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు .. ఆన్ స్క్రీన్ చాలా ఎత్తుగా కనిపిస్తున్నావ్.. నటన సహజంగా ఉంది .. ఎమోషన్ పండించావ్.. బాగా నటించావ్.. అని ప్రశంసించారు.హీరో కాదు.. ఆ రోల్ కనిపించింది!!
అని అంత పెద్ద దర్శకుడి ప్రశంస దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది.
* థియేటర్లు విజిట్ చేశారా?
ప్రసాద్ మల్టీప్టెక్స్ తో పాటు మాస్ థియేటర్లలో ఆడియెన్ స్పందన చూశాను. ది బెస్ట్ రెస్పాన్స్ దక్కింది.
* భవిష్యత్ ప్రాజెక్టులు?
తెలుగు, తమిళంలో అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి.
* భవిష్యత్ ప్లానింగ్?
నా గత చిత్రాలు మామ చందమామ, మంచు కురిసే వేళలో సినిమాల్లో నా నటనకు చక్కని పేరొచ్చింది. తాజాగా రిలీజైన రెండు చిత్రాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపైనా విలక్షణమైన పాత్రల్లో నటించాలనుంది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు అంటే ఇష్టం. ప్రేక్షకులు మెచ్చే కొత్త కథల్ని ఎంచుకుంటాను. లవర్ బోయ్ పాత్రలే కాదు.. కొంచెం రగ్గ్ డ్ గా ఉండే మాస్ పాత్రలు చేయాలనుంది.
*స్వస్థలం.. స్వగతం?
పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. అయితే మా కుటుంబానికి విజయనగరం- వైజాగ్ కనెక్షన్ ఉంది. నాన్నగారు స్థిరాస్తి రంగంలో ఉన్నారు.
The post Happy to get compliments from K. Raghavendra Rao Garu: Hero Ram Karthik appeared first on Social News XYZ.