మంచువారబ్బాయి మంచు విష్ణు హీరో గా నటించిన తాజా చిత్రం 'ఓటర్'.. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి జిఎస్ కార్తీక్ దర్శకుడు..రమా రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సురభి హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంపత్‌రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర టీజర్ ని నేడు విడుదల చేసింది చిత్ర బృందం.. ఈ టీజర్ లో "అహింసా మార్గం ద్వారా..ఒక్క బులెట్ కూడా కాల్చకుండా.. స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది.." "మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైనా పోరాటం చేయలేదు.." "మార్పు మనలో రావాలి..మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని.."అని మంచు విష్ణు చెప్పే డైలాగ్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటూ ఈ టీజర్ కే హైలైట్ గా నిలుస్తున్నాయి.. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీ గా ఉన్న ఈ చిత్రాన్ని వేసవి లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు : మంచు విష్ణు , సురభి, సంపత్‌రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి తదితరులు...
సాంకేతిక నిపుణులు : రచన, దర్శకత్వం : జిఎస్ కార్తీక్ నిర్మాత : జాన్‌సుధీర్ పూదోట బ్యానర్ : రమా రీల్స్ బ్యానర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల సంగీతం: ఎస్.ఎస్. తమన్ కెమెరా: రాజేష్ యాదవ్ ఫైట్స్ : కణల్ కన్నన్, సిల్వ, వెంకట్ పి.ఆర్.ఓ : వంశీ - శేఖర్
The post Manchu Vishnu’s Voter Movie Teaser Released appeared first on Social News XYZ.