రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ" ఈ రోజుల్లో ఒక 3 ని.లు తెలుగులో మాట్లాడాలంటేనే చాలా కష్టమవుతోంది..మరి ఈ చిత్రంలో కథానాయకుడు,నాయకి ల మధ్యన తెలుగులో మాట్లాడాలనే ప్రేమపరీక్ష ఎలా వుంటుందో చూడాలి..అని,ఈ పాటలో తెలుగులోని పద్యం,సామెతా,ఛందస్సు మరియు అలంకారాల గురించి రచయిత చాలా చక్కగా వివరించారు..సంగీతం,సాహిత్యం,గానం,నృత్యం,నటీనటుల హావభావం చక్కగా కుదిరాయి..దర్శకనిర్మాతలకు మరియు ఈ చిత్ర సభ్యులకు నా యొక్క అభినందనలు..
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..తెలుగు భాష అమరం..అజరామరం..ఇప్పుడున్న రోజుల్లో పూర్తిస్థాయి తెలుగులో మాట్లాడడమంటే చాలా కష్టం.అదే ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం నిజంగా అభినందనీయం..నిర్మాత బసిరెడ్డి మరియు దర్శకుడు సంతోష్ కృష్ణ , చిత్ర యూనిట్ సభ్యులకు నా అభినందనలు..
అలాగే చిత్రనిర్మాత కిషోరి బసిరెడ్డి గారు మాట్లాడుతూ "నేను 25సం.లు అమెరికాలో వుండివచ్చాను..నా తెలుగులో తప్పులుంటే క్షమించాలి..ఈ చిత్రంలో అందరూ తెలుగులోనే మాట్లాడాలి,లేదంటే మన తెలుగు భాష మరుగున పడి పోతుంది" అని దర్శకుడు చెప్పిన సందేశం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాను..అందరికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు..
చివరలో ఈ చిత్ర దర్శకుడు మరియు ఈ తెలుగు పాట రచయిత సంతోష్ కృష్ణ మాట్లాడుతూ..మన మాతృభాష తెలుగుని కాపాడుకోవాలంటే అది యువతీయువకుల చేతుల్లోనే వుందని..ఉడుకు మనసు కల ఇద్దరు యువతీయువకుల మధ్య గిల్లిగజ్జాలాటే ఈ 'ఒక తెలుగు ప్రేమకథ' అని దీనికి సంగీతం మహిత్ నారాయణ్,గానం: సాయికిరణ్, రచన: బి.యస్.కె అని..నటీనటులు..మహేంద్ర. లావణ్య, సమ్మెటగాంధీ,భవాని శంకర్, సాకేత్ మాధవి,బేబి కీర్తన..సాంకేతిక నిపుణులు..ఛాయాగ్రాహకుడు: దేవేందర్ రెడ్డి,కూర్పు:కృష్ణపుత్ర, నృత్యం: రాజ్ పైడి అని తెలిపారు..
The post Oka Telugu Prema Katha Movie first look released appeared first on Social News XYZ.