Quantcast
Channel: Actresses Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95785

Shakalaka Shankar, Satya And Madhunandan On Board For Nandita Swetha Starrer Akshara

$
0
0

రెండో షెడ్యూల్ లో ‘‘అక్షర’’

Shakalaka Shankar, Satya And Madhunandan On Board For Nandita Swetha Starrer Akshara

విద్యతో సామాజిక మార్పు సాధ్యం అవుతుందని నమ్మే అక్షర అందుకోసం ఏం చేసింది అనే కాన్సెప్ట్ తో రూపొందుతోన్న సినిమా ‘అక్షర’. బలమైన పాయింట్ చుట్టూ తిరుగుతూనే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఇన్ఫోటైన్మెంట్ గా సాగే సినిమా ఇది. కంటెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ తో ప్రతి ఒక్కరినీ అలరిస్తూ ఆలోచింపచేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బి.చిన్నికృష్ణ. సంక్రాంతి సందర్భంగా భోగి రోజు విడుదల చేసిన అక్షర మోషన్ పోస్టర్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ టీజర్ తోనే ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి చర్చించుకునేలా చేసింది చిత్రటీమ్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అక్షర మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో నందితతో పాటు కీలక పాత్రల్లో నటిస్తోన్న షకలక శంకర్, సత్య, మధునందన్ పాల్గొంటున్నారు. వీరి పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నాయి. అటు ఎంటర్టైన్మెంట్ ను ఇస్తూనే హీరోయిన్ కు అండగా నిలిచే యువకులుగా నటిస్తున్నారీ ముగ్గురు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ‘‘అక్షర’’ షూటిగ్ త్వరలోనే పూర్తి కాబోతోంది. ఇక మే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది టీమ్. వేసవిలో వచ్చే అన్ని చిత్రాలతో పాటు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూనే ఓ ప్రత్యేమైన అనుభూతిని ఇచ్చేలా తమ చిత్రం నిలుస్తుందని బలంగా నమ్ముతోంది ‘‘అక్షర’’ చిత్ర యూనిట్. నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో కనిపించబోతోన్న ఈ చిత్రానికి

కెమెరామాన్: నగేష్ బెనెల్ ,

మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి,

ఎడిటర్: జి.సత్య,

ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి,

కాస్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు,

లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి,

పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా,

సి.ఎఫ్. ఓ: "యస్ మీడియా" సుమంత్.కో

ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి

నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్

నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ

రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.

The post Shakalaka Shankar, Satya And Madhunandan On Board For Nandita Swetha Starrer Akshara appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 95785

Trending Articles