Quantcast
Channel: Actresses Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95890

Nagakanya movie teaser to be launched on February 11th

$
0
0

ఈ నెల 11న వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న "నాగకన్య" టీజర్ లాంచ్

Nagakanya movie teaser to be launched on February 11th Nagakanya movie teaser to be launched on February 11th

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా... ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్, రెండో లుక్ గా లక్ష్మి రాయ్ పోస్టర్స్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్, లక్ష్మి రాయ్ విభిన్నమైన లుక్ తో కనిపించారు. ఈ పోస్టర్స్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేథరీన్ క్యారెక్టర్ తో కూడిన పోస్టర్ ని 10వ తేదీన విడుదల చేస్తారు ఈనెల 11న నాగకన్య టీజర్ ని రిలీజ్ చేస్తారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య లుక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్ ని విడుదల చేశాం. మూడో పోస్టర్ గా కేథరీన్ లుక్ ని 10న విడుదల చేస్తాం. ఈ నెల 11న నాగకన్య టీజర్ విడుదల చేస్తాం. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.  అని అన్నారు

The post Nagakanya movie teaser to be launched on February 11th appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 95890

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>