Quantcast
Channel: Actresses Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95890

Priya Prakash Varrier’s Lovers day movie releasing on February 14th

$
0
0

ఫిబ్రవరి 14న ప్రియ వారియర్ ‘లవర్స్ డే’ రిలీజ్

Priya Prakash Varrier's  Lovers day movie releasing on February 14th

Priya Prakash Varrier’s Lovers day movie releasing on February 14th (Photo:SocialNews.XYZ)

వింక్ గర్ల్‌ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన 'లవర్స్ డే' చిత్రం ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానున్నది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు.

నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. "జనవరి 23వ తేదీన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్ సూపర్ హిట్ అయ్యింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఆడియో ఫంక్షన్ కు వచ్చిన అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఆయన రాకతో మా సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది. చిన్న చిత్రానికి బన్నీ అందించిన సహకారాన్ని మాటల్లో చెప్పలేం. ఆడియో రిలీజ్ తర్వాత ప్రియా ప్రకాశ్ వారియర్ కు టాలీవుడ్‌లో క్రేజ్ మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా చేసేందుకు, ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదాన్ని అందించేందుకు ప్రీ ప్రోడక్షన్ పనులను క్వాలిటీతో రూపొందించాం. ప్రియ వారియర్‌కు తెలుగులో ఉమ (ప్రముఖ దర్శకుడు రేలంగి నర్సింహారావు తమ్ముడి కూతురు), ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రను పోషించిన నూరిన్‌కు సింగర్ లిప్సిక డబ్బింగ్ చెప్పారు. లవర్స్ డే చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. గీత రచయితలు చంద్రబోస్, చైతన్య ప్రసాద్, శివ గణేష్, శ్రీజో, శ్రీ సాయికిరణ్ సాహిత్యాన్ని అందించారు. ఇందులో ఓ పాట థియేటర్లలో ప్రేక్షకులకు సర్ఫ్రైజ్‌గా ఉంటుంది.ప్రియా వారియర్ క్రేజ్, పాటలకు విపరీతమైన స్పందన రావడంతో పెరిగిన అంచనాలకు తగినట్టుగా అన్ని ఏరియాల్లో బ్రహ్మండమైన బిజినెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలకు అన్ని హంగులు పూర్తి చేసుకొన్నాం. ప్రేమికుల దినోత్సవం కానుకగా లవర్స్ డే చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం" అని తెలిపారు

న‌టీన‌టులు:
ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :
కెమెరా: శీను సిద్ధార్థ్‌
ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

The post Priya Prakash Varrier’s Lovers day movie releasing on February 14th appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 95890

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>