విశాల్ తెలుగు సినిమా వివరాలు !


హీరో విశాల్ జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ఈ హీరో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు తేజ డైరెక్ట్ చెయ్యనున్నాడట.
ప్రస్తుతం తేజ బెల్లంకొండ శ్రీనివాస్ తో సీత అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ నుండి విశాల్ తో తేజ సినిమా స్టార్ట్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఎప్పటినుండో తెలుగు సినిమా చెయ్యాలని భావిస్తున్న విశాల్ చివరికి తేజతో సినిమా చెయ్యబోతుండడం విశేషం. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
The post Teja to direct Vishal’s Telugu movie? appeared first on Social News XYZ.