సాయికృష్ణా ఫిలింస్ ద్వారా ఫిబ్రవరి 8న తెలుగులో శివకార్తికేయన్ " సీమరాజ " విడుదల

Sivakarthikeyan and Samantha’s Seema Raja movie to release on February 8th in Telugu (Photo:SocialNews.XYZ)
ఈ సందర్బంగా నిర్మాత సాయికృష్ణా పెండ్యాల మాట్లాడుతూ.. రోమియో చిత్రం ధియెటర్స్ ఎవెరేజ్ గా ఆడింది కాని టివి లో మాత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఎప్పుడూ ఆ చిత్రం వచ్చినా కూడా ఫ్యామిలి అంతా కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ చిత్రం తో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు.. రొమియో తరువాత తెలుగులో శివకార్తికేయన్ నటించిన సీమరాజ ఫిబ్రవరి 8 న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సాయికృష్ణా ఫిలింస్ బ్యానర్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నాము. రెండు వూర్ల మద్య జరిగే పక్కా కమిర్షియల్ చిత్రం ఈ సీమరాజ.. తమళం లో బి, సి సెంటర్స్ లో కలెక్షన్లు దుమ్మురేపింది. సీమరాజ గా శివకార్తికేయన్ నటన కి మాస్ ఆడియన్స్ విజిల్స్ పడటం ఖాయం. తమిళంలో లాగా తెలుగులో కూడా కమర్షియల్ గా పెద్ద విజయం సాధిస్తుంది. అతి త్వరలో మ్యూజిక్ ని విడుదల చేస్తాము. లక్ష్మి పెండ్యాల సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం లో ఆర్,డి,రాజా నిర్మించారు. సమంత చాలా మించి పాత్రలో నటించిది. ఫిబ్రవరి 8 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. అని అన్నారు.
దర్శకత్వం... పోన్రమ్
నిర్మాత.. సాయికృష్ణ పెండ్యాల
సమర్ఫణ.. లక్ష్మి పెండ్యాల
సంగీతం.. డి.ఇమ్మాన్
డిజైనర్.. ఈశ్వర్
The post Sivakarthikeyan and Samantha’s Seema Raja movie to release on February 8th in Telugu appeared first on Social News XYZ.