మిష్టర్ మజ్ను సెన్సార్ టాక్ !
అఖిల్ మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ మెంబెర్స్ ఈ చిత్రానికి యు/ఏ సట్టిఫికేట్ ఇవ్వడం జరుగింది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిపోర్ట్స్ పాజిటీవ్ గా ఉన్నాయి.
సెన్సార్ రిపోర్ట్స్ మేరకు ఈ మూవీతో అఖిల్ మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యూత్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా కావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమన్ అందించిన పాటలు బాగున్నాయి. నిధి అగర్వాల్ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.
అఖిల్ నటించిన మొదటి సినిమా ప్లాప్ అయ్యింది, రెండో సినిమా యావరేజ్ గా నిలిచింది. మరి మూడో సినిమా ఏ విధంగా ఉంటుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది. తొలిప్రేమ సినిమాను అందంగా తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మొవీని డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.
The post Akhil’s Mr.Majnu movie censor talk! appeared first on Social News XYZ.