ఈ మెగా హీరో సినిమా ఎవరితో ?
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలైనా వేరే సినిమా షూటింగ్ మొదలుకాలేదు. 14 రీల్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ సినిమాకు బడ్జెట్ ఎక్కువగా అవుతుందని సినిమా ఆపేశారు. ఈ విషయం జరిగాక దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.
తమిళ్ లో వచ్చిన జిగర్ తాండ సినిమాను వరుణ్ తేజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హరీష్ శంకర్ వరుణ్ బాడీ ల్యాంగ్వేజ్ కు తగ్గట్లు మార్చి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చినా అది మొదలవ్వలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు.
తాజాగా వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ తో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ బ్రదర్ బాబీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన లేదు. అసలు వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చెయ్యబోతున్నాడో ఎవ్వటికి అర్థం కావడం లేదు.
The post What’s next for Varun Tej? appeared first on Social News XYZ.