పవర్ ఫుల్ పాత్రలో అన్నపూర్ణమ్మ



ఎవరెస్టు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం ఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సీనియర్ మోస్ట్ నటీమణి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. నర్రా శివనాగేశ్వర్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న అందమైన ఓ గ్రామంలో షూటింగ్ ను జరుపుకోనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత చిత్ర విశేషాలను పంచుకుంటూ ఓ పల్లెటూరిలో ఎవరికీ ఏం జరిగినా రచ్చబండ పంచాయతీ దర్బార్ లో పెద్ద దిక్కైన అక్కినేని అన్నపూర్ణమ్మ అనే వినూత్న పవర్ ఫుల్ పాత్రలో నటీమణి అన్నపూర్ణ కనిపిస్తున్నారు.
ఆ పల్లెటూరిలోనే ఆమె కు ధీటుగా ఎదురెళ్లే వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడుగా సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. ఇక షూటింగ్ సెట్ విషయానికి వస్తే.. ఆ ఊరిలోనే పంచాయతీ దర్బార్ సెట్ అందరినీ ఆకర్షింప చేస్తుంది. అంతేకాకుండా పంచాయతీ సన్నివేశాలకు గానూ రెండు వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు.
ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అర్చన హీరోయిన్ గా నటిస్తుండగా జీవ, రఘు బాబు , కాటమంచి రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, శ్రీ హర్ష, అదుర్స్ సాయి, రమాప్రభ, శ్రీలక్ష్మి, ప్రభ, జయ వాణి తదితరులు నటిస్తున్నారని నిర్మాత ఎం ఎన్ ఆర్ చౌదరి చెప్పుకొచ్చారు.
The post Annapurnamma In A Powerful Role In Annapurnamma Gari Manavadu appeared first on Social News XYZ.