Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94496

Pranavam movie being made with Bharatanatyam as backdrop

$
0
0

భ‌ర‌త‌నాట్యం బ్యాక్ డ్రాప్ లో   ‘ప్రణవం’

Pranavam movie being made with Bharatanatyam as backdrop

చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం,  శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్  ప్ర‌ధాన పాత్ర‌ల్లో  కుమార్‌ జి. దర్శక‌త్వంలో తను.ఎస్‌  నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రణవం’. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు కుమార్‌.జి చిత్ర విశేషాలు తెలియజేస్తూ...‘‘ఇప్పటికే మా సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.   చండీఘర్‌కు చెందిన మోడల్‌ అవంతిక హరి నల్వా హీరోయిన్‌గా నటిస్తుండగా, గాయత్రి అయ్యర్ మ‌రో ముఖ్య భూమిక‌లో  నటిస్తోంది. భ‌ర‌త‌నాట్యం నేప‌థ్యంలో  ల‌వ్‌ ,సస్పెన్స్‌ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం.  అన్ని వర్గాల  ప్రేక్షకుల‌కు నచ్చే సినిమా అవుతుంద‌న్న‌న‌మ్మ‌కంతో ఉన్నాం.  అలాగే మా సినిమాకు  మ్యూజిక్   ప్రధాన ఆకర్షణగా నిల‌వనుంది.  ఆర్‌.పి.పట్నాయక్‌గారు, ఉష గారు కలిసి ఒక డ్యూయెట్ మా సినిమాలో ఆల‌పించారు. త్వరలో ఆడియో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఫ్రెష్ కాన్సెప్ట్ తో యంగ్ టీమ్ అంతా కలిసి చేస్తోన్న మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వదిస్తార‌ని  కోరుకుంటున్నాం’’ అన్నారు.

జెమిని సురేష్‌, నవీన, జబర్దస్త్‌ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్వో: వంగాల‌ కుమార స్వామి; స్టిల్స్‌: శశాంక్‌ శేఖర్‌; డిఓపి: మార్గల్‌ డేవిడ్‌;  కొరియోగ్రాఫర్‌: అజయ్ శివ‌శంక‌ర్‌;   కో-డైరక్టర్‌: శ్రావణ్ న‌ల్లూరి;  సంగీతం: పద్మనావ్‌ భరద్వాజ్‌;  ఎడిటర్‌: సంతోష్‌; ఫైట్స్‌: దేవరాజ్‌; లిరిక్స్‌: కరుణాకర్‌, సిహెచ్‌ విజయ్‌కుమార్‌, రామాంజనేయులు; నిర్మాత: తను.ఎస్‌; కో- ప్రొడ్యూసర్స్‌: వైశాలి, అనుదీప్‌; దర్శకత్వం: కుమార్‌.జి.

The post Pranavam movie being made with Bharatanatyam as backdrop appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94496

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>