వినయ విధేయ రామాలో చరణ్ రెండు పాత్రల్లో !
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చరణ్ పచ్చ బొట్టు వేసుకున్న పాత్ర ఒకటైదే మరొకటి మామూలుగా ఉండవచ్చు.
ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో చరణ్ పచ్చ బొట్టుతో కనిపిస్తున్నాడు, లాగే ఫ్యామీలి ఎపిసోడ్స్ లో నార్మల్ గా కనిపిస్తున్నాడు. దీన్ని చూస్తుంటే చరణ్ రెండు విభిన్నమైన రోల్స్ లో దర్శనం ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విడుదల తరువాత ఈ విషయం గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫ్యామీలి ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని సమాచారం. దేవి సంగీతం అందించిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. కైరా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.
The post Kiara Advani in Allu Arjun and Trivikram’s film? appeared first on Social News XYZ.