Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94874

`Unmaadi` Movie Audio Launched

$
0
0

`ఉన్మాది` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

`Unmaadi` Movie Audio Launched

ప్రవీణ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై  ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ఎన్‌.కరణ్‌ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్మాది`. ఎన్‌.ఆర్‌.రెడ్డి కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్‌.రామారావు నిర్మాత‌. డేవిడ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను రాజ్‌కందూరి ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్‌ను ఎన్‌.శంక‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా .... డైరెక్టర్ ఎన్‌.శంకర్ మాట్లాడుతూ మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి  సినిమాకు స్టోరి, స్క్రీన్ ప్లే,డైలాగ్స్,డైరెక్షన్  చేయడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి అ లాంటిది డేర్ ఎన్.ఆర్.రెడ్డి గారు నిజం గా చాలా దైర్యం చేసి సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది.తమిళ్‌లో రాజ్ కుమార్‌గారు కూడా ఇదే ఏజ్‌లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఎన్‌.ఆర్‌.రెడ్డి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో అద్భుతంగా నటించారు.  హీరోయిజం,విలనిజం రెండూ చూపించదగిన క్యారెక్టర్. టీం అందరికి ఆల్ ధి బెస్ట్ అన్నారు.

నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఫంక్షన్‌కి రావడం జరిగింది. కాన్సెప్ట్‌కి  తగిన పేరు అని చెప్పారు. ఎన్.ఆర్.రెడ్డిగారు మంచి క్రియేటివ్ డైరెక్టర్. డేవిడ్ మంచి పాటలు ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అన్నారు
నటుడు కృష్ణుడు మాట్లాడుతూ రెండు రోజుల ముందు ఈ సినిమా ట్రైలర్ చూసి ఈ ఫంక్షన్‌కి వ‌చ్చాను. ఎన్.ఆర్.రెడ్డి చాలా బాగా నటించారు.చిన్న సినిమాలను ఆదరించాల్సిందిగా మనవి అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్  డేవిడ్ మాట్లాడుతూ ఇది నా ఫస్ట్ ఫిలిం. రెడ్డి గారు నన్ను చాలా నమ్మి ఈ సినిమాను ఇవ్వడం జరిగింది. అన్ని పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరూ ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు

హీరోయిన్ శిరీష మాట్లాడుతూ ఆడియో చాలా నచ్చింది.సినిమాలో అన్ని సీన్లు చాలా బాగా వచ్చాయి. సినిమాలో నాది మంచి క్యారెక్టర్. ఎన్ ఆర్ రెడ్డి గారు చాలా మంచి డైరెక్టర్.  చాలా సపోర్ట్ ఇచ్చారు. తప్పకుండా అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత మరియు డైరెక్టర్ ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ నేను బేసిక్ గా స్వర్గీయ హరికృష్ణ గారికి పెద్ద అభిమానిని, ఓరకంగా ఆయనే నా ఇన్‌స్పిరేషన్.. ఈ  ఉన్మాది సినిమా లో ఒక్కసారైనా ఆయనలా కనిపించాలని ప్రయత్నించాను.. ఒక్క క్షణం అలా కనిపించి ఉన్నా నేను స‌క్సెస్ అయిన‌ట్లే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. కథ అనుకున్నప్పుడే రాఘవ కు చెప్పి ఆయన సపోర్ట్ తీసుకున్నా.. అతను ఇన్వాల్వ్ అయ్యి ఎంతో సపోర్ట్ ఇచ్చారు.. అలానే షూటింగ్ జరిగిన నకరెకల్ ఊర్లో కూడా అందరి సపోర్ట్ బాగుంది. ఇక నేను చేసిన డేర్ సినిమా కూడా చాలా మంచి సపోర్ట్ అందించారు. ఈ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంది ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను కలుగ జేస్తుంది. మా ఆర్టిస్టు లు టెక్నీషియన్స్‌కి నా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. సినిమా చూసి మంచి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను అన్నారు.

అల్లు రమేశ్‌, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత, సోను, రాజేశ్వరి, డిఎస్‌పి, వెంకటాంజనేయులు, ఫణి సూరి, మున్నా, జానకి రామయ్య తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్‌, కెమెరా: దంటు వెంకట్‌, ఎడిటర్‌: కె.ఎ.వై.పాపారావు, ఫైట్స్‌: దేవరాజ్‌, కొరియోగ్రఫీ: సామ్రాట్‌, జోజో, నిర్వహణ: ఎన్‌.వరలక్ష్మి, క్రియేటివ్‌ డైరెక్టర్‌ : రాఘవ, నిర్మాత: ఎన్‌.రామారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.ఆర్‌.రెడ్డి.

The post `Unmaadi` Movie Audio Launched appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94874

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>