వెంకీ కొత్త సినిమా వివరాలు !
వెంకటేష్ గురు సినిమా తరువాత సోలో హీరోగా ఏ సినిమా చేయలేదు. ఆ మధ్య తేజ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించి ఆపేశారు. ఆ తరువాత వెంకీ వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 సినిమాలో నటించాడు. జనవరి 12న సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా సమాచారం మేరకు వెంకటేష్ సోలో హీరోగా ఒక సినిమా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. దర్శకుడు వినాయక్ చెప్పిన కథ నచ్చి వెంటనే ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష్మి సినిమా తరువాత వినాయక్, వెంకీ కలిసి చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.
ఆ మధ్య పూరీ జగన్నాధ్, కిశోర్ తిరుమలతో వెంకీ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ ఏదీ స్టార్ట్ కాలేదు, అలాగే బాబీ దర్శకత్వంలో వెంకీ మామ మొదలయ్యింది కానీ ఇంతవరుకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. నాగ చైతన్య ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.
The post Venktesh’s next with V.V. Vinayak? appeared first on Social News XYZ.