దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సారథ్యంలో దెందులూరి ఫౌండేషన్ `ఆధ్యాత్మ రామాయణం- బాలకాండ``
దెందులూరి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవాసంస్థ.. 2009 సంవత్సరంలో దెందులూరి నళినీ మోహన్, పద్మా మోహన్ దంపతులచే స్థాపించబడింది. నళినీ మోహన్ ఐఎఫ్ఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి విభాగం-ప్రధాన అటవీ సంరక్షకులు. ఆయన శ్రీమతి పద్మామోహన్ ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి, స్వరనర్తనం స్థాపకులు.
విద్య, విజ్ఞానం, సంస్కృతి, కళల ద్వారా సమాజ సేవ చేయడమే లక్ష్యంగా గత 10 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తోంది. దివ్యాంగ కళాకారుల్ని ఆదరించడం, ఆర్థిక సహాయం అందించడం, వృద్ధ కళాకారులను ఆదుకోవడం, పేద విద్యార్థులకు చేయూత నివ్వడంతో పాటు, నాట్యకళను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ప్రముఖులకు అవార్డులిచ్చి సన్మానిస్తున్నారు. ఆంధ్ర నాట్యకళను ప్రోత్సహించడానికి, ప్రాచుర్యంలోకి తేవడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014లో ఆంధ్ర నాట్యం మీద అవగాహన కల్పించడానికి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలతో ఆధ్యాత్మ రామాయణం-బాలకాండపై డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను శ్రీమతి దెందులూరి పద్మామోహన్, వారి కుమార్తె దెందులూరి మూర్తి అఖిల జ్యోతి స్వయంగా నర్తించి సమర్పిస్తున్నారు.
కళాకృష్ణ నృత్య దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణ నేతృత్వ సారధ్యంలో మీర్ దర్శకత్వంలో ఈ డాక్యమెంటరీ రూపొందింది. దీనికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్, ప్రతిపాటి పుల్లారావు, కె.రాఘవేంద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సాహిత్య విశిష్ట కృషి పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అందుకున్నారు. రామకమల్ ల్యాబ్స్ ప్రొప్రైటర్ పి.ఎస్.శ్రాస్త్రి, ప్రఖ్యాత హరికథా విద్వాంసురాలు శ్రీమతి ఉమామహేశ్వరి, ప్రముఖ యోగా శిక్షకులు జి.చంద్రకాంత్‌లను సన్మానించారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - మన పిల్లలకి సంస్కృతి, సంప్రదాయాలు, కళలను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవశ్యకతను గుర్తించి ఓ షౌండేషన్‌ను స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నళినీ మోహన్, పద్మా మోహన్‌లకు అభినందనలు తెలుపుతున్నాను
అన్నారు.
రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ మోహన్ కందా మాట్లాడుతూ - మనం సమాజం నుండి ఎంతో పొందుతుంటాం. మళ్లీ ఆ సమాజానికి తమ వంతుగా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకునేవారు కొంత మందే. అటువంటి ఆలోచన ఉన్న నళినీమోహన్, పద్మామోహన్‌లు ఓ ఫౌండేషన్‌ను స్థాపించి, ఈ ఫౌండేషన్ మరింత ముందుకు వెళ్లి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నాను
అన్నారు.
మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ - ఆంధ్ర నాట్యం గుర్తింపు కోసం దెందులూరి ఫౌండేషన్ వారు చేస్తున్న కృషి అభినందీనయం. వారికి మా వంతుగా మేం సపోర్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఢిల్లీ వెళ్లి వెంకయ్యనాయుడుగారిని కలిసి ఈ ప్రయత్నాన్ని మరిం త ముందుకు తీసుకెళతాను. నళినీ మోహన్‌గారు విలువల గల మనిషి. ఈ ఫౌండేషన్‌కు మా వంతు సహకారాన్ని అందిస్తాను
అన్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ - మారుతున్న పరిస్థితుల్లో మన సంస్కృతి, కళలను మరచిపోకుండా ముందుకు తీసుకెళుతున్న దెందులూరి ఫౌండేషన్‌ను అభినందిస్తున్నాను. ఆంధ్రనాట్యం గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నా వంతుగా కోరుతున్నాను. తండ్రి పేరుని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న నళినీ మోహన్, పద్మామోహన్‌లను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను
అన్నారు.
సిరివెన్నెల మాట్లాడుతూ - ఓ ఫౌండేషన్‌ను స్థాపించి సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నళినీ మోహన్, పద్మామోహన్‌లను అభినందిస్తున్నాను. వారితో అసోసియేట్ కావాలనుకుంటున్నాను
అన్నారు.
మీర్ మాట్లాడుతూ - దెందులూరి ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు
అన్నారు.
కళా కృష్ణ మాట్లాడుతూ - నాట్యంలోని అభిరుచి గురించి ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్న దెందులూరి ఫౌండేషన్‌కు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుండి కూడా ఈ సహకారం ఉంటుందని భావిస్తున్నాం
అన్నారు.
The post Adhyatma Ramayanam Balakanda documentary by Denduluri Foundation under Raghavendra Rao supervision appeared first on Social News XYZ.