ఒక సీక్వెల్ ను వదులుకొనున్న నాగార్జున !.
అక్కినేని నాగార్జున ఒక తమిళ్ సినిమా ఒక హిందీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాల్లో అతిథి పాత్రలే. తాజాగా ఈ అక్కినేని హీరో తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్, కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. మరొకటి మన్మధుడు సీక్వెల్. .రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు.
తాజా సమాచారం మేరకు ఈ సీక్వెల్స్ లోనుండి ఒకటి చేయకూడదు అనుకుంటున్నట్లు సమాచారం. బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ఇప్పుడు చేయకూడదని నాగార్జున భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏ సీక్వెల్ ను వదులుకుంటాడో చూడాలి.
నాగార్జున నటించిన సినిమాలు ఇటీవల వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ఈ నేపద్యంలో మంచి కథలు వస్తే చేయాలని నాగార్జున కొత్త కథలను వింటున్నట్లు తెలుస్తోంది. అలాగే అఖిల్, నాగ చైతన్య సినిమాల స్టోరీ సెలెక్షన్స్ కూడా నాగార్జున దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్ కెరీర్ పై నాగ్ బాగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.
The post Nagarjuna to drop one of the sequels appeared first on Social News XYZ.