డిసెంబర్ 27న `వినయ విధేయ రామ` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్


మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ
. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. భారీ సెట్‌లో తుది పాట చిత్రీకరణ జరుపుకుంటంది. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ నెల 27 న యూసప్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ ప్రముఖులు, మెగాభిమానుల సమక్షంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా... స్టార్ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో
వినయవిధేయరామ` సినిమాను ప్రకటించినప్పటి నుండి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మెగాభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేషనే అందుకు సాక్ష్యం. ఒక పాట మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం భారీ సెట్‌లో చివరి పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 27న హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ ప్రముఖులు, మెగాభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ లెవల్లో నిర్వహించబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం`` అన్నారు.
The post Vinaya Vidheya Rama Pre Release Event On December 27th appeared first on Social News XYZ.