ఎన్‌టిఆర్ ఫంక్షన్ కు అతిథులు వీరే!

ఎన్‌టిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్‌టిఆర్ కథానాయకుడు, ఎన్‌టిఆర్ మహానాయకుడు. మొదటి పార్ట్ ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. ఈ వేడుకకు ఎన్‌టిఆర్ బంధువులు, మిత్రులు తదితరులు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా నిమ్మకూరు నుండి ఎన్‌టిఆర్ పాత స్నేహితులు ఈ ఫంక్షన్ కు రాబోతుండడం విశేషం.
చిత్ర పరిశ్రమ నుండి కృష్ణ, కృష్ణంరాజు వంటి సీనియర్ హీరోలతో పాటు జూనియర్ ఎన్‌టిఆర్ ఈ ఫంక్షన్ కు రాబోతుండడం విశేషం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాయగా సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిఈ సినిమాను నిర్మించారు.
రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, శ్రియ, శాలీని పాండే, పాయల్ రాజ్ పుత్ వంటి హీరోయిన్స్ తో పాటు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్ నటించారు. తక్కువ కాలంలో ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా జనవరి రెండో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
The post Jr.NTR And Entire Family Of Legendary NTR Will Be Attending The Audio And Trailer Launch Of NTR Biopic appeared first on Social News XYZ.