`కొత్తగా మా ప్రయాణం` ట్రైలర్ విడుదల
ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కొత్తగా మా ప్రయాణం
. యామిని భాస్కర్ కథానాయిక. ఈ వర్షం సాక్షిగా
ఫేం రమణ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయి, నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవలే రిలీజైన టీజర్ ఆద్యంతం ఫన్, లవ్, యాక్షన్, వినోదంతో ఆకట్టుకుంటోంది. తాజాగా ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఆడియో త్వరలో రిలీజ్ కానుంది.
దర్శకుడు రమణ మాట్లాడుతూ-ఇటీవలే రిలీజైన టీజర్ కి జనం నుంచి చక్కని స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేశాం. దీనికి అద్భుత స్పందన వస్తోంది. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు వేగంగా పూర్తవుతున్నాయి. నవతరం సినిమాల్లో యూనిక్ పాయింట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్పటికే క్రేజు వచ్చింది. కథాంశం అందుకు తగ్గట్టే ప్రామిస్సింగ్‌గా .. ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే పరంగానూ కొత్తగా ఉండే చిత్రమిది. పదిమందికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమకథలో ట్విస్టులేంటో తెరపైనే చూడాలి. అందరికీ సాయపడే తత్వం ఉన్నా హీరోకి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకం ఉండదు. అయితే అలాంటివాడు మన సాంప్రదాయం విలువను, గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. నెలకు 2లక్షల జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ కుర్రాడి కథ ఇది. ప్రియాంత్ కి తొలి సినిమానే అయినా తడబడకుండా చక్కగా నటించాడు. యామిని భాస్కర్ అందచందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆ ఇద్దరికీ పేరొస్తుంది. యువతరాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేస్తున్నాం
అన్నారు.
భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, కరుణాకర్, సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి.
The post Kothaga Maa Prayanam Movie Theatrical Trailer Released appeared first on Social News XYZ.