నిర్మాతకు షాక్ ఇచ్చిన హీరోయిన్ మెహరిన్ !
విజేత సినిమాతో హీరోగా పరిచయం అయిన కల్యాణ్ దేవ్ రెండో సినిమాను పులివాసు అనే నూతన దర్శకుడితో చేస్తున్నాడు. మొదట ఈ సినిమాకు హీరో సుధీర్ బాబు, హీరోయిన్ మెహరిన్. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సుధీర్ బాబు స్థానంలో కల్యాణ్ దేవ్ వచ్చాడు. ఈ చిత్ర నిర్మాతలు హీరో మారాడు కావున హీరోయిన్ ను కూడా మార్చాలి అనే నిర్ణయానికి వచ్చారు కావున మెహరిన్ కు తాము ఇచ్చిన అడ్వాన్స్ లో కొంత పట్టుకొని మిగితా అమౌంట్ ఇవ్వాలని కోరారు. అందుకు మెహరిన్ నిరాకరించింది.
నిర్మాతల అమౌంట్ తిరిగి ఇవ్వడానికి నో చెప్పిన కారణంగా నిర్మాతలు ఈ విషయాన్ని నిర్మాతల మండలికి తీసుకొని వెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో నిర్మాత మండలి హీరోయిన్ మెహరిన్ ను పిలిచి పూర్తి వివరాలు తెలుసుకొని నిర్మాతలకు న్యాయం చెయ్యనున్నారు. హీరోయిన్ మెహరిన్ గతంలో కూడా ఇలానే ప్రవర్తించిందని సమాచారం. వరుస ఫ్లాప్స్ పడుతున్నా ఈ హీరోయిన్ ఇప్పటికీ 75 లక్షలు అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈమె ఎప్పుడు మారుతుందో ఏమో ?
The post Mehreen Pirzada refuses to return the advance appeared first on Social News XYZ.