బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడు మారుతాడు ?
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో భారీతనం తప్పా మరేమీ ఉండదని మరోసారి కవచం సినిమా నిరూపించింది. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు. కానీ, ఆ ఐడియాకి సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. చెప్పాలనుకున్న కథను చెప్పలేకపోయారు.
కవచం సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోవడం, చాలా చోట్ల స్క్రీన్ ప్లే నమ్మశక్యంగా లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమా విఫలం అవ్వడానికి కారణం అయ్యాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఇటువంటి మూస ధోరణి కథలను పక్కనపెట్టి మంచి కథలను ఎంచుకుంటే బాగుంటుంది.
సినిమాకు హీరోయిన్స్, హంగామా, సెట్స్ అవసరం లేదు. మంచి కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారు. వరుసగా మూడు అట్టర్ ప్లాప్స్ లో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆశలన్నీ తన నెక్స్ట్ సినిమా పైనే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు సీత.
The post When will Bellamkonda change? appeared first on Social News XYZ.