Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Rajamouli’s RRR to add one more ‘R’

$
0
0

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో మరో ఆర్!

Rajamouli's RRR to add one more 'R'

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్ లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదారాబాద్ లో జరుగుతోంది. డిసెంబర్ 12 న రాజమౌళి ఈ సినిమాకు సంభందించి ఒక ప్రకటన చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్స్ పేర్లు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లిగా రమ్యకృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాలో శివగామిగా అలరించిన రమ్యకృష్ణను రాజమౌళి మరోసారి తన సినిమాలో తీసుకుంటున్నాడు. ఈ వార్తా అధికారికంగా ఎక్కడా ప్రకటించనప్పటికి ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెందిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. రచయిత బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. సినిమాను నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీగా అద్భుతమైన లొకేషన్స్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి రాజమౌళి ఎలాంటి వార్తా ప్రకటిస్తాడోనన్న ఆసక్తి ఉంది.

The post Rajamouli’s RRR to add one more ‘R’ appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles