నాని వినూత్నమైన ప్రయత్నం!
ఇష్క్, మనం, 24, హలో లాంటి వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ త్వరలో నానిని డైరెక్ట్ చెయ్యబోతుండడం విశేషం. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
తాజా సమాచారం మేరకు విక్రమ్ కుమార్ ఈ సినిమాను పూర్తిగా వి.ఎఫ్.ఎక్స్ తో రూపొందిస్తున్నాడని సమాచారం. సూర్య 24 చిత్రం తరహాలో ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందని సమాచారం. ఇటీవలే నాని ఈ సినిమా కోసం ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నాడని, త్వరలో ఆ ఫోటోలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ కుమార్ అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని భావించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సీజమా స్టార్ట్ కాలేదు. బన్నీకి చెప్పిన కథ ఇప్పడు నానితో చేయబోతున్న కథ వేరు వేరని టాక్. నాని ప్రస్తుతం జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాని క్రికెట్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు.
The post Nani to work with Director Vikram Kumar appeared first on Social News XYZ.