ఎన్‌టిఆర్ బయోపిక్ లో జయప్రద, జయసుధ !


క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఎన్‌టిఆర్ బయోపిక్ సినిమాలో జయసుధ పాత్రను ఆర్.ఎక్స్.100 హీరోయిన్ పాయల్ చేస్తోంది. పాయల్ రాజ్ పుత్ కు, జయసుధ ముఖః కవళికలు దగ్గరగా ఉండటం తో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ లో సెలెక్ట్ చేశారు.. అలాగే జయప్రద పాత్ర కోసం హన్సికను ఎంపిక చేశారు. వీరిద్దరిని ఇటీవలే లాక్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఎన్‌టిఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్‌టిఆర్ కథానాయకుడు పేరు తో జనవరి 9 న సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో మరింత మంది హీరోయిన్స్ నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 9న తిరుపతిలో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. చిత్రంలో నటించిన నటీనటులు అందరూ ఈవెంట్ కు హాజరు కాబోతున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాను నిర్మాతలు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, నందమూరి బాలకృష్ణలు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది.
The post Jaya Prada and Jayasudha in NTR Biopic appeared first on Social News XYZ.