దూసుకుపోతున్న 'హుషారు' పాటలు


లక్కీ మీడియా సంస్థలో 9వ చిత్రంగా వస్తున్న 'హుషారు' పాటలు సంచలనాలు రేపుతున్నాయి.అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ రధాన్ మ్యూజిక్ చేసిన - సిద్ శ్రీరామ్ పాడిన 'ఉండిపోరాదే' పాట ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో 2 మిలియన్ దాటి ,మిగతా ట్విట్టర్ ,పేస్ బుక్ ,టిక్ టాక్ ,ఇంస్టాగ్రామ్ మొత్తం సోషల్ మీడియా లో 5 మిలియన్ వరకు రీచ్ అయ్యి 'హుషారు' సినిమా రేంజ్ ని అమాంతం పెంచేసింది.పూర్తి యూతఫుల్ కధాంశంతో తెరకెక్కిన ఈ హుషారు సినిమా డిసెంబర్ (ఏడున) 7న విడుదల అవుతుంది .
ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే గుంటూరు ,విజయవాడ ,ఖమ్మం ,వరంగల్ ,నెల్లూరు సిటీ లో అన్ని ముఖ్య కాలేజెస్ లో సందడి చేస్తుంది.
బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ హుషారు కి రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు .తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా,దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు.రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు.
The post Husharu Movie Jukebox Gets 2 Million Views appeared first on Social News XYZ.