డిసెంబర్ 7న విడుదలకు సిద్దమైన సుబ్రమణ్యపురం


వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ బ్యానర్ పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు సంతోష్ జాగర్లముడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సుబ్రమణ్యపురం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్ తో డిసెంబర్ 7న అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సైన్స్ కి అందని ఎన్నో రహాస్యాలు మానవ మేథస్సుకు సవాళ్ళు విసురుతూనే ఉంటాయి. భగవంతుని మీద నమ్మకం కూడా అలాంటిదే, ఆ నమ్మకాన్ని ప్రశ్నించే కార్తిక్ పరిశోధనలు ఎలాంటి నిజాలను వెలుగులోకి తెచ్చాయి..? కాపాడవల్సిన భగవంతుడి ఆగ్రహం తట్టుకోవడం సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు కు సమాధానం ఈ నెల 7న దొరకబోతుంది. విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఒకరోజులో 1మిలియన్ వ్యూస్ ని సాధించిన సుబ్రమణ్యపురం ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపింది. థ్రిల్లర్స్ లో సుబ్రమణ్యపురం ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుదని అంటుంది చిత్ర యూనిట్. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘సుబ్రమణ్యపురం’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘సుబ్రమణ్యపురం ’ కు వర్క్ చేసారు. బాలసుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 7న బ్రహ్మండమైన విడుదలకు
సిద్దం అవుతన్న సుబ్రమణ్యపురం ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తుందని నమ్మకం వ్యక్త పరిచింది చిత్ర యూనిట్.
హీరో: సమంత్,
హీరోయిన్ః ఈషారెబ్బ
ప్రధాన తారాగణంః సురేష్, సాయికుమర్, అలి, సత్య సాయి శ్రీనివాస్,
మిర్చి మాధవి, సుర్య, రఘునాథ్ రెడ్డి, సారిక రామచంద్రరావు, జోష్
రవి, బద్రం, గిరిధర్, అమిత్ శర్మ, టి.ఎన్.ఆర్.
సాంకేతిక వర్గంః
సినిమాటోగ్రఫిః ఆర్.కె. ప్రతాప్
ఎడిటర్ః కార్తిక్ శ్రీనివాస్
సంగీతంః శేఖర్ చంద్ర
క్యాస్టూమ్ డిజైనర్ః సుమ త్రిపురణ
ఫైట్స్ః డ్రాగన్ ప్రకాష్
పి.ఆర్.ఓః జియస్ కె మీడియా
కో డైరెక్టర్ః ఆర్.సురేష్
ప్రొడ్యూసర్ ః బీరమ్ సుధాకర్ రెడ్డి
రైటర్ అండ్ డైరెక్టర్ః సంతోష్ జాగర్లపూడి..
The post Sumanth’s Supernatural Thriller Subramanyapuram Censored With UA appeared first on Social News XYZ.