`వినయ విధేయ రామ` టాకీ పార్ట్ పూర్తి... 2019 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్


మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతో్న చిత్రం వినయ విధేయ రామ
. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. డిసెంబర్ 10 నుండి హైదరాబాద్‌లో భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీకరించబోతున్నారు.
ఈ సందర్భంగా... అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - క్రేజీ కాంబినేషన్ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో టైటిల్‌ను `వినయ విధేయ రామ` అని అనౌన్స్ చేయగానే చాలా మంచి స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ను ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా విషయానికి వస్తే.. టాకీ పార్ట్ పూర్తయ్యింది. హైదరాబాద్‌లో భారీ సెట్‌ను వేసి అందులో డిసెంబర్ 10 నుండి ఓ సాంగ్‌ను పిక్చరైజ్ చేయబోతున్నాం. ఆల్ రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాం
అన్నారు.
The post Vinaya Vidheya Rama Movie Talkie Part Shoot Completed, Grand Release For Sankranthi appeared first on Social News XYZ.