అల్లు అర్జున్ సినిమా కొత్త ట్విస్ట్ !
అల్లు అర్జున్ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. తమిళ దర్శకుడు లింగుస్వామితో ఒక సినిమా, విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా చర్చల దశలో ఉండి ఆగిపోయాయి. కొత్తగా త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ చిత్రం సోను కే టిటు కీ స్వీటీ తెలుగు రీమేక్‌లో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది.
తాజా సనాచారం మేరకు త్రివిక్రమ్ రీమేక్ కథను పక్కన పెట్టి కొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. సోను కే స్వీటీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించింది. కానీ అల్లు అర్జున్ కు సోను కే టిటు సినిమా సెట్ అవ్వదని కొందరు చెప్పడంతో కొత్త కథతో సినిమా చెయ్యడానికి రెడీ అయిపోతున్నారు.
నాపేరు సూర్య సినిమా విడుదలై నెలలు గడుస్తున్నాయి కావున బన్నీ కొత్త సినిమాను అనౌన్స్ చెయ్యాలని వెయిట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ స్టోరి వర్క్ ఫినిష్ చేయగానే సినిమాను ప్రకటిస్తారు. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
The post Allu Arjun’s next movie hits another snag appeared first on Social News XYZ.