కీర్తి సురేష్ తెలుగు సినిమా ఖరారు !
మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇటీవల ఈ హీరోయిన్ నటించిన సర్కార్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తెలుగులో ఈ హీరోయిన్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. కీర్తి సురేష్ త్వరలో నాని పక్కన నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఈ హీరోయిన్ నానితో నేను లోకల్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటిది విభినమైన శైలి. ఈ దర్శకుడు గతం లో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ కథను గోపిచంద్ కి షిఫ్ట్ అయినట్లు మరో వార్త వినిపించింది . తాజాగా ఈ కథ నాని ఒకే చేసినట్లు సమాచారం.
ఈ కథకు నాని పక్కన కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించడం జరిగిందట. నాని పక్కన కీర్తి ఈ సినిమాలో ఆల్ మోస్ట్ ఖరారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ లోకూడా కీర్తి ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
The post Keerthy Suresh’s next Telugu movie confirmed appeared first on Social News XYZ.