సుమంత్ అశ్విన్ , నందిత శ్వేత ల "ప్రేమ కథా చిత్రం 2
ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమర్షియల్ సక్సస్ ని సాధించిన ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథాచిత్రమ్2 . ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్,సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న "ప్రేమ కథా చిత్రం 2" సినిమా మెదటిలుక్ ని విడుదల చేసుకుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వస్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా నటన సూయర్ ప్లస్ అవుతుంది.
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ, విధ్యులేఖ, ప్రభాస్ శ్రీను, ఎన్.టి.వి.సాయి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ - సి. రాం ప్రసాద్,
ఎడిటర్ - ఉద్ధవ్ యస్.బి
సంగీతం - జె.బి
డైలాగ్ రైటర్ - గణేష్
లిరిక్ రైటర్- అనంత్ శ్రీరామ్,కాసర్ల్య శ్యామ్, పూర్ణా చారి.
ఆర్ట్ - కృష్ణ
కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు - హరి కిషన్
The post Sumanth Ashwin and Nandita Swetha starrer Prema Katha Chitram 2 movie shoot completed appeared first on Social News XYZ.