Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94849

Crazy Crazy Feeling move teaser gets a good response

$
0
0

" క్రేజీ కేజీ ఫీలింగ్ " టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

Crazy Crazy Feeling move teaser gets a good response

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా

దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా , పల్లక్ లల్వాని హీరోయిన్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రం తెరకెక్కుతోంది . ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం . వెన్నెల కిశోర్ ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే లెంగ్తీ క్యారెక్టర్లో కడుపుబ్బ నవ్విస్తాడు. ఈ సినిమాకు ఆయన మెయిన్ పిల్లర్ గా నిలిచారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ సినిమా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. టీజర్ కు వస్తున్న స్పందనతో మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అని అన్నారు.

నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ , ఫీల్ , వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు. టీజర్ కు చాలా మంచి స్పందన వస్తోంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. కథ బాగా నచ్చడంతో ఆయన చాలా సపోర్ట్ చేశారు. భీమ్స్ మంచి పాటలందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నస్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ - విజ్ఞత ఫిలిమ్స్ పతాకం
సంగీతం - భీమ్స్ సిసిరోలియో,
సాహిత్యం - సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ ,
కెమెరా - సుభాష్ దొంతి ,
ఆర్ట్ - నాగు ,
కొరియోగ్రఫీ - రాజకిరణ్ , చార్లీ
పిఆర్వో - ఏలూరు శ్రీను
నిర్మాత - నూతలపాటి మధు
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - సంజయ్ కార్తీక్

The post Crazy Crazy Feeling move teaser gets a good response appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94849

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>