‘తెలంగాణ దేవుడు’ ఆడియో విడుదల

మ్యాక్ ల్యాబ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై.. మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడ్‌త్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాని, సంగీత హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదిత్య మ్యూజిక్ ద్వారా హైదరాబాద్ పార్క్ హయాత్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ చిత్ర సీడీలను విడుదల చేశారు.
దర్శకుడు సాగర్, బ్రహ్మానందం, అలీ, అజయ్, వెంకట్, దర్శకుడు రవికుమార్ చౌదరి, డి.ఎస్.రావు, జైరాజ్, కందికొండ, మొహ్మద్ గౌస్ భాషా, మొహ్మద్ తఖీ అన్సారి, మొహ్మద్ జఖీ ఉస్మాని, మొహ్మద్ ఫసీ ఉస్మాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ... ‘‘ఈ ఆడియో కార్యక్రమానికి వచ్చి మమ్మల్నీ ఆశీర్వదించిన పెద్దలందరికీ మా టీమ్ తరపున కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
హీరో జిషాన్ ఉస్మాని మాట్లాడుతూ.. ‘‘నాతో పాటు ఈ చిత్రంలో నటించి, నాకు విలువైన సూచనలు ఇచ్చిన నటీనటులందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఐ లవ్ మై డాడ్..’’ అని అన్నారు.
దర్శకుడు హరీష్ వడ్‌త్యా మాట్లాడుతూ.. ‘‘నాది ఖమ్మం. 2002లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాకు బ్యాక్‌బోన్ ఎవరూ లేరు. నాకు నేనే కష్టపడి వచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టాను. డి.ఎస్.రావుగారి సహకారంతో సాగర్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అదే నాకు ఈ రోజు బాగా ఉపయోగపడింది. ఎన్నో కష్టాలు పడ్డాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌గారే నా దేవుడు. ప్రతీ మాటకి తోడుగా ఉండి నేను అడిగిన దానికంటే ఎక్కువగా ఖర్చుపెట్టి సినిమా చేశారు. మరో సినిమా కూడా నాతో చేస్తానని నాకు మాట కూడా ఇచ్చారు. అంత కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి. నన్ను ఆయన తన సొంత తమ్ముడులాగా ఆదరించారు. నేను జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది..’’ అని అన్నారు.
హీరోయిన్ సంగీత మాట్లాడుతూ.. ‘‘మై లక్కీ హీరో శ్రీకాంత్. మేమిద్దరం కలిసి దాదాపు ఐదు చిత్రాల్లో నటించాము. శ్రీకాంత్ మా అన్నయ్య. జిషాన్ హ్యాండ్‌సమ్ హీరో. మ్యూజిక్ డైరెక్టర్‌గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రాఫర్ విజయ్‌గారితో ఇది నా 3వ చిత్రం. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. మీరందరూ తప్పక ఆదరిస్తారని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నందన్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకి సంగీతం చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. నా సాంగ్ విన్నాక ప్రొడ్యూసర్ గారు నన్ను ఎ.ఆర్.రెహమాన్ అని అన్నారు. అది నేను మర్చిపోలేను. ఆయనకు నా మీద ఉన్న నమ్మకానికి నా కృతజ్ఞతలు. ఈ పాటలు ఇంత అద్భుతంగా రావడానికి ప్రొడ్యూసర్‌గారు, డైరెక్టర్‌గారు అందించిన సహాయ సహకారాలను మరిచిపోలేను..’’ అని అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘నాకు హరీష్ వచ్చి సబ్జెక్ట్ చెబితే.. ముందు నేను చేయాలా.. వద్దా అని ఆలోచించాను. రెండురోజుల తర్వాత చెబుతానని చెప్పాను. సబ్జెక్ట్ లో కూడా చాలా ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన క్యారెక్టర్‌ని చేయడం చాలా గర్వంగా ఉంది. ప్రతీ క్యారెక్టర్‌ని చాలా బాగా తీర్చిదిద్దారు. దీనంతటికీ కారణం మన ప్రొడ్యూసర్‌గారు. ఆయనకు సినిమాపై ఉన్న గ్రిప్ వల్ల సాధ్యమైంది. ఆయనకు ఉన్న ట్యాలెంట్‌కి ఆయన డైరెక్టర్‌గా కూడా చేయగలరు. ప్రతీ సీన్ దగ్గరుండి చూసుకున్నారు. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మన ఇండస్ట్రీకి వచ్చారు. జిషాన్ నా తమ్ముడు లాంటి వాడు. తనకు ఆల్ ద బెస్ట్. మంచి అద్భుతమైన మ్యూజిక్‌ని అందించారు మ్యూజిక్ డైరెక్టర్. మేమంతా ఒక ఫ్యామిలీలాగా కలిసి చేశాం. ఎక్కడా ఏ పొరపాటు రాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా చక్కగా చేసిన చిత్రమిది. మీరందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మానీ, బ్రహ్మానందం, అలీ, సుమన్, పోసాని కృష్ణమురళీ, తనికెళ్ల భరణి, వెంకట్, అజయ్, షియాజీ షిండే, ప్రసాద్ బాబు, కేదార్ శంకర్, శివన్నారాయణ, జీవ, విజయ్ రంగరాజు, ఈటీవీ ప్రభాకర్, సమీర్, కమల్ కామరాజు, తోటపల్లి మధు, ఏడిద శ్రీరాం, గీతా భాస్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, భాను, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్: హరిబాబు. ఎస్., సంగీతం: నందన్ రాజు బొబ్బిలి, స్టిల్స్: వెంకట్ ముంబై, ఎడిటర్: గౌతంరాజు, కెమెరా: విజయ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: మొహ్మద్ ఖాన్, సమర్పణ: మొహ్మద్ గౌస్ భాషా, మొహ్మద్ తఖీ అన్సారి, మొహ్మద్ జఖీ ఉస్మాని, మొహ్మద్ ఫసీ ఉస్మాని; మూలకథ-నిర్మాత: మొహ్మద్ జాకీర్ ఉస్మాన్, రచన-దర్శకత్వం: హరీష్ వడ్‌త్యా.














The post Telangana Devudu Movie Audio Launched appeared first on Social News XYZ.