ఫ్లాప్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్!
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి విజయాలు సాధించిన హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం, ఎఫ్2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో మొదటిది డిసెంబర్ లో విడుదల కాబోతోంది, రెండో సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ రెండు చిత్రాల తరువాత వరుణ్ తేజ్ మరో మూడు సినిమాల్లో నటించడానికి రెడీ అయిపోతున్నాడు. అందులో మొదటిది దర్శకుడు హరీష్ శంకర్ సినిమా. డిజే సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన హరీష్ తో వరుణ్ త తమిళంలో సిద్దార్ద హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన 'జిగర్‌తండ'. చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయటానికి రైట్స్ తీసుకుని వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. .
అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటీ అంటే 'జిగర్‌తండ' చిత్రాన్ని ఆల్రెడీ తెలుగులో 'చిక్కడు దొరకడు' టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. మరోసారి హరీష్ శంకర్ తనదైన స్టయిల్ లో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో మరో యువహేరో నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలతో పాటు డైరెక్టర్ సాగర్ చంద్ర తో ఒక సినిమా పరుశురామ్ బుజ్జితో మరో సినిమా చెయ్యబోతున్నాడు వరుణ్ తేజ్.
The post Varun Tej to work with Harish Shankar appeared first on Social News XYZ.