అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతున్న 'కేజీఎఫ్' ట్రైలర్


ఈ నెల 9న ఐదు భాషల్లో విడుదలైన ‘కేజీఎఫ్’ ట్రైలర్ అత్యధిక వ్యూవ్స్‌తో దూసుకుపోతోంది. మొత్తం ఐదు భాషల్లో కలిపి నాలుగు రోజుల్లో 3 కోట్ల వ్యూవ్స్ వచ్చాయి. ఒక్క తెలుగులోనే 6 మిలియన్ వ్యూవ్స్ సాధించింది. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న కేజీఎఫ్ సినిమా ట్రైలర్ మరెన్ని మిలియన్ల వ్యూవ్స్ సాధిస్తుందో చూడాలి.
లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)’. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
The post KGF Trailers gets more than 30 million in 4 days appeared first on Social News XYZ.