ఆ దర్శకుడితో రవితేజ సినిమా ఉంది !
రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నవంబర్ 13న ప్రకటించాలి అనుకున్నారు. కానీ రవితేజ అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నందున వి.ఐ.ఆనంద్ సినిమా లుక్ ను పోస్ట్ పోన్ చేశారు. రవితేజ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. గతంలో ఈ బ్యానర్ రవితేజతో నేలటికెట్ సినిమాను చేశారు. ఈ సినిమా . తరువాత మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో సంతోష్ శ్రీనివాస్ సినిమా ఉంటుందని సమాచారం. ఈ దర్శకుడితో రవితేజ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదని సమాచారం.
అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా విషయానికి వస్తే.. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఇలియానా రీఎంట్రీ ఇవ్వబోతోంది. మూడోసారి రవితేజ శ్రీనువైట్ల తో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై కొంతవరుకు హైప్ ఉంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీస్ ఫంక్షన్ లో చిత్ర రవితేజ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని, సినిమా డబ్బింగ్ చెబుతున్న సమయంలో బాగా ఎంజాయ్ చేశానని రవితేజ చెబుతున్నాడు. ఈనెల 16న విడుదల కాబోతున్న అమర్ అక్బర్ ఆంథోనీ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.
The post Raviteja to work with Santosh Srinivas for Mytri Movie Makers appeared first on Social News XYZ.