రజినీకాంత్ హీరోయిన్ తో చిరంజీవి!

Mumbai: Actress Huma Qureshi at the "GQ Men of the Year Awards 2018" in Mumbai on Sept 27, 2018. (Photo: IANS)
వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ 'భరత్ అనే నేను' చిత్రంతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. తన నెక్స్ట్ సినిమా చిరంజీవితో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన మొదట తమన్నా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చిరు పక్కన హీరోయిన్ హుమ కురేసి నటించబోతోందని టాక్ వినిపిస్తుంది. ఈ హీరోయిన్ గతంలో రజినీకాంత్ సరసన కాలా సినిమాలో నటించింది. చిరు పక్కన ఈ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందంటే తెలుగులో ఈ హీరోయిన్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొరటాల శివ చిరంజీవిని రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నుండి మొదలు కానుందని సమాచారం. సైరా షూటింగ్ పూర్తి అయ్యే వరుకు చిరు కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొనకూడదని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి నాటికి సైరా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి వర్క్స్ చేస్తున్నారు. కొరటాల శివ, చిరంజీవి సినిమాకు సంభందించి పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొంత టైమ్ పడుతుంది.
The post Ranjin’s heroine roped in for Chiru’s next appeared first on Social News XYZ.