చరణ్, బోయపాటి: మాస్ పోస్టర్, క్లాస్ టీజర్ !.


రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న వినేయ విధేయ రామ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయ్యింది. బోయపాటి శ్రీని స్టయిల్లో మాస్ లుక్ విడుదల అయ్యింది. మరి 9న టీజర్ఎలా ఉండబోతోంది ? బోయపాటి శ్రీను ఈసారి టీజర్ ను క్లాస్ గా కట్ చేశాడని సమాచారం. పోస్టర్ మాస్ గా ఉన్నా టీజర్ క్లాస్ గా ఉండనుందని టాక్ వినిపిస్తుంది. టీజర్ లో చిత్ర హీరో, హీరోయిన్, హీరో బ్రదర్స్ ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ అందరూ టీజర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగ డివివి దానయ్య నిర్మించారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత చరణ్ నటించిన సినిమా కావడం, బోయపాటి డైరెక్ట్ చెయ్యడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
The post Vinaya Vidheya Rama: After massy first look here comes classy teaser appeared first on Social News XYZ.