అల్లు అర్జున్ సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది ?.
అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. మరి సినిమాను ఎందుకు బన్నీ అధికారికంగా ప్రకటించడానికి ఆలస్యం చేస్తున్నాడు ? హిందీలో విజయం సాధించిన సోనూ కే టీటూ కీ స్వీటీ సినిమానే త్రివిక్రమ్ బన్నీతో చెయ్యబోతున్నాడు. సినిమా మొత్తం కాకుండా కేవలం సోల్ ను తీసుకొని స్క్రీన్ ప్లే మొత్తం మార్చి తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. స్క్రిప్ట్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదు కావున సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వగానే మూవీని అనౌన్స్ చేసి వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. అందుచేత అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ కాస్త నెమ్మదిగా చేద్దాం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అరవింద సమేత సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బన్నీ విక్రమ్ కుమార్ కథను పక్కన పెట్టి త్రివిక్రమ్ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా బన్నికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందో చూడాలి.
The post Why is Allu Arjun film getting delayed? appeared first on Social News XYZ.