టాలీవుడ్ లో సంచలనాలు క్రియోట్ చేసిన "ఏడు చేపల కథ" హక్కులు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్న శ్రీలక్ష్మి పిక్చర్స్
"యూట్యూబ్ లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు... నీకుంటదమ్మో..మా అమ్మకి చెబుతా.. మీటు" అంటూ విడుదలయ్యి సంచలనం సృష్టించిన ఏడుచేపల కథ హక్కుల కొసం టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రానికి సంభందించి వరల్డ్‌వైడ్ ధియెట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారు సొంతం చేసుకోవటం జరిగింది. ఇప్పటికే టీజర్ కి ఓక్కసారిగా ప్రపంచంలో వున్న తెలుగు ప్రేక్షకులందరూ ముఖ్యంగా కుర్రకారంతా ఫుల్ ఛార్ట్ తో యాక్టివేట్ అయ్యారు దీని ఉదాహరణ ఈ టజర్ కి యూట్యూబ్ లో అన్ని ఛానల్స్ కలిపి 18 మిలియన్స్ (దాదాపు కొటి ఎనభై లక్షల మంది ) వ్యూస్ రావటం అతిపెద్ద రికార్డు గా నిలిచిపోతుంది. అది కూడా ఆర్గానిక్ గా రావటంతొ టాలీవుడ్ లో సంచలనం గా మారింది. కేవలం తెలుగు సిని పరిశ్రమనే కాకుండా తమిళ నాట కూడా ఈ టీజర్ సంచలనం కావటం విశేషం.. "ఏడు చేపల కథ" చిత్రంలో టెమ్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో హీరో అభి ఇప్పటికే టీజర్ ద్వారా ఫేమస్ అయ్యాడు. అడల్డ్ కామెడీ జోనర్ లో పూర్తిగా కొత్త వారితో రూపోందుతున్న ఈ చిత్రంలో అభిషెక్ రెడ్డి తొ పాటు బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్రం హక్కులు సొంతం చేసుకున్న శ్రీలక్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ... . అడల్డ్ కామెడీ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్ గా హక్కులు మేము సొంతం చేసుకున్నాము. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కి ఈ మద్యకాలంలో RX100 అనే చిత్రం తరువాత దీనికే రావటం యువతలో క్రేజ్ విపరీతంగా వుండటం విశేషం. ఈ తరహా టీజర్ ఇప్పటివరకూ టాలీవుడ్ లో రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. త్వరలో ఈ సినిమా మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. హీరో అభిషేక్ రెడ్డి కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. తన పెర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ అప్‌డేట్స్ ని తెలియజేస్తాం. అని అన్నారు.
నటీనటులు
అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - చరిత సినిమా ఆర్ట్స్
సమర్పణ - డా.రాకేష్ రెడ్డి
నిర్మాతలు - శేఖర్ రెడ్డి, జివిఎన్
సహ నిర్మాత - గుండ్ర లక్ష్మీ రెడ్డి,
సంగీతం - కవి శంకర్,
కెమెరా - ఆర్లీ,
పిఆర్ఓ - ఏలూరు శ్రీను,
రచన, దర్శకత్వం - శామ్ జే చైతన్య
The post Yedu Chepala Katha movie rights bagged by Sri Lakshmi Pictures for a fancy price appeared first on Social News XYZ.