యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న "హ్యాపి వెడ్డింగ్" కోసం తమన్ రీ రీ రికార్డింగ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్టాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా "హ్యాపి వెడ్డింగ్" యువి క్రియేషన్స్ బ్యానర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. మ్యూజికల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి అద్భుతమైన సంగీతం అందించిన తమన్ రీ రీ రికార్డింగ్ చేస్తుండడం విశేషం. రీ రీ రికార్డింగ్ లో తమన్ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు ఫిదా చిత్రం తో సంగీత ప్రియులకు మంచి మ్యూజికల్ ఫీస్ట్ అందించిన శక్తికాంత్ అద్భుతమైన పాటలు అందిస్తుంన్నారు. తమన్ రీ రీ రికార్డింగ్, శక్తికాంత్ పాటలతో హ్యాపీ వెడ్డింగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలవనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలు సాధిస్తున్న క్రేజీ బ్యానర్ యు వి క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ తో కలిసి మేము "హ్యాపి వెడ్డింగ్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తున్నారు. ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌బస్టర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ హ్యాపీ వెడ్డింగ్ ప్రాజెక్టు లోకి తమన్ ఎంటర్ అయ్యారు. తనదైన రీ రీ రికార్డింగ్ తో మెస్మరైజ్ చేయబోతున్నారు. రోమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ లో బిజీగా వుంది. లక్ష్మణ్ కార్య మంచి విజన్ ఉన్న దర్శకుడు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితం లో ఇలాంటి అనుభవం జరిగివుంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమనితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న హ్యాపీ వెడ్డింగ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అని అన్నారు..
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు..
సాంకేతిక నిపుణులు..
యువి క్రియేషన్స్ సమర్పణలో
మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్
కెమెరా - బాల్ రెడ్డి
మ్యూజిక్ - శక్తికాంత్ కార్తిక్
నిర్మాత - పాకెట్ సినిమా
దర్శకత్వం - లక్ష్మణ్ కార్య
The post Thaman to do re-recording for Happy Wedding movie appeared first on Social News XYZ.