Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94874

M6 movie completes post production work

$
0
0

M6 movie completes post production work

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్ పై స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణ లో విశ్వనాధ్ తన్నీరు , సురేష్ సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం " యమ్ 6". ధ్రువ , శ్రావణి , అశ్విని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి జైరామ్ దర్శకుడు . ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది .

సందర్భం గా నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ ఈ సినిమాను క్వాలిటీ లో రాజీ పడకుండా నిర్మించాము . ఈ చిత్రంలోని " ఈ క్షణం" అనే ఒక పాట ఉంది. ఈ పాటను అరకు , మంగళూరు లో సుందరమైన లొకేషన్స్ లో చిత్రీకరించాం . సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు .

దర్శకుడు జైరామ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సస్పెన్స్ తో పాటు కామెడీ , యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి . సినిమాటోగ్రఫీ , సంగీతం బాగా కుదిరాయి అన్నాడు

హీరో ధ్రువ మాట్లాడుతూ ఇది నా తొలి చిత్రం . అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుందీ చిత్రం . ఓ మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది . నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ఎప్పటికీ ఋణపడి ఉంటా అన్నాడు .

ధ్రువ , శ్రావణి , అశ్విని , తిలక్ , సాధన ,అప్పలరాజు , గోవింద , హరిత , వంశీ , ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి సంగీతం : విజయ్ బాలాజీ , ఎడిటింగ్ :వంశీ కందాల , సినిమాటోగ్రఫీ : మహ్మద్ రియాజ్ , నిర్మాతలు : విశ్వనాధ్ తన్నీరు , సురేష్, దర్శకత్వం : జైరామ్

VISWANATH FILM FACTORY,
SRI LAKSHMI VENKATADRI CREATIONS ,
PRODUCER VISWANATH TANNEERU,
HERO DHRUVA,
DIRECTOR JAIRAM,
STAR ACTING STUDIO

The post M6 movie completes post production work appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94874

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>