Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95102

Vijay, Atlee & Sharath Marar’s Adirindi completes shoot

$
0
0

విజయ్ అట్లి,  తెన్నాండల్ స్టూడియోస్, శరత్ మరార్ " అదిరింది" షూటింగ్ పూర్తి

Vijay, Atlee & Sharath Marar's Adirindi completes shoot

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కుమూడు రాష్ట్రాల్లో  అద్భుతమైన స్పందన లభించింది. అటు విజయ్ అభిమానులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాలు అదిరింది టైటిల్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

మురళీ రామస్వామి మాట్లాడుతూ… నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్ తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నాం.  ప్ర‌ముఖ నిర్మాత శరత్ మరార్ గారు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ఈ దీపావ‌ళి కి గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ చిత్రాలు నిర్మించిన శరత్ మరార్ గారికి టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరుంది. ఆయనతో అసోసియేట్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.  అని అన్నారు.

శరత్ మరార్ మాట్లాడుతూ… విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ వందో చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో దీపావ‌ళి కి  గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. విజయ్ కు తెన్నాండల్ స్టూడియోస్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. అని అన్నారు.

ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది. ఆగస్ట్ లో ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మొదలు పెట్టారు. అక్టోబర్ లో ఈచిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు - విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్

సాంకేతిక నిపుణులు
సంగీతం - ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం - వివేక్
సినిమాటోగ్రాఫర్ - జి.కె.విష్ణు
ఎడిటర్ - రుబన్
యాక్షన్ - అనల్ అరసు
కొరియోగ్రఫి - శోభి
స్టోరీ - విజయేంద్రప్రసాద్
స్క్రీన్ ప్లే - విజయేంద్ర ప్రసాద్, రమణ గిరివాసన్

నిర్మాతలు - మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - అట్లీ

The post Vijay, Atlee & Sharath Marar’s Adirindi completes shoot appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 95102

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>