ఉంగరాల రాంబాబుకు 'యు బై ఏ' సెన్సార్ సర్టిఫికెట్.... ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 15న గ్రాండ్ రిలీజ్
సునీల్ హీరోగా, మియాజార్జ్ హీరోయిన్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు బై ఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను అభినందనలతో ముంచెత్తడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెరకెక్కంచిన ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ నటించిన గత చిత్రాల కంటే హై స్టాండర్డ్ లో వుంటుంది. సునీల్ తరహా కామెడి , క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపిస్తాయి. కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అని చెప్పాలి.
మెస్ట్ క్రేజియస్ట్ ప్రోడ్యూసర్ దిల్ రాజు వాయిస్ ఓవర్ ఇవ్వటం ఉంగరాల రాంబాబు కి ప్రధానమైన హైలెట్. 2017 సంవత్సరం మెదలు కొని దిల్ రాజు నిర్మాతగా శతమానం భవతి, నెను లోకల్, డి.జె, ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వరుసగా విజయాలు సాధించి సక్సస్‌ని కేరాఫ్ గా మార్చుకున్నారు. ఓ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, ప్రోడ్యూస్ చేయాలన్నా ఆ చిత్రం లో ఎంతో విషయం వుంటే కాని దిల్ రాజు ఇన్ వాల్వ్ అవ్వరు. ఇదిలా వుంటే అసలు వాయిస్ ఓవర్ అంటే ఏ హీరోతోనో లేదా ఏ ఫేమస్ ఆర్టిస్ట్ తోనే చెప్పించుకుంటారు. కాని మెట్టమెదటి సారిగా నిర్మాత దిల్ రాజు గారితో చెప్పించుకొవటం విశేషం.
నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
సాంకేతిక వర్గం
మ్యూజిక్ - జిబ్రాన్
లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ - వెంకట్
డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి - భాను మాస్టర్
పబ్లిసిటీ - ధని
పిఆర్ఓ - ఏలూరు శ్రీను,
బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్
ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి
డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్
The post Ungarala Rambabu censored with UA, grand release on September 15th appeared first on Social News XYZ.